Logo
Date of Publish : 23 June 2026, 4:22 pm
Editor : Katta Ravindar

తపాలా ఉద్యోగుల మహాధర్నా

బంగారుపాళ్యం జూన్ 23 : గ్రామీణ తపాలా ఉద్యోగులను ఎనిమిదవ వేతన సంఘ పరిధిలోనికి చేర్చాలని, ఉద్యోగులపై రుద్దుతున్న బలవంతపు టార్గెట్లను వెంటనే ఎత్తివేయాలని, డిపార్ట్మెంట్ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ ఇవ్వాలని, గ్రామీణ తపాలా ఉద్యోగులకు 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, అక్రమంగా విధుల నుండి తొలగించిన ఆల్ ఇండియా జనరల్ సెక్రెటరీ కామ్రేడ్ మహదేవయ్య ని వెంటనే విధులలోకి తీసుకోవాలని డిపార్ట్మెంట్ ఉద్యోగులతో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతూ అఖిల భారత గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం సాయంత్రం స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద చిత్తూరు డివిజనల్ అధ్యక్ష, కార్యదర్శులు కామ్రేడ్ డి మోహన్ రాజారెడ్డి, కామ్రేడ్ ఏ. అరుణ ల నాయకత్వంలో

ఉద్యోగులంతా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
తమ కోరికలకు మద్దతుగా నినాదాలు చేశారు. డివిజన్ నలుమూలల నుండి దాదాపు 350 మంది గ్రామీణ తపాలా ఉద్యోగులు పాల్గొన్న ఈ ధర్నాలో ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల మహిళా విభాగం అధ్యక్షురాలు కామ్రేడ్ ఏ అరుణ మాట్లాడుతూ గ్రామీణ తపాలా ఉద్యోగులకు వెంటనే వేతన సంఘాన్ని నియమించాలని, తమ ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను తక్షణమే తీర్చాలని, అవాస్తవిక టార్గెట్ల ద్వారా జిడిఎస్ ఉద్యోగులపై వేధింపులను తక్షణమే ఆపాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం ,అధికారులు అనుసరిస్తున్న అణచివేత కార్యక్రమాలకు నిరసనగా తమ కోర్కెలకు మద్దతుగా డివిజన్ నలుమూల నుండి ఎంత పెద్ద ఎత్తున ధర్నాలో గ్రామీణ తపాలా ఉద్యోగుల పాల్గొనడం పట్ల నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )