Logo
Date of Publish : 04 August 2026, 4:20 pm
Editor : Katta Ravindar

అనాథలకు, మానసిక వికలాంగులకు, నిరాశ్రయులకు అండగా నిలిచిన మనోబంధు ఫౌండేషన్

కె24న్యూస్ తెలుగు ఆగష్టు 04. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని బస్టాండ్, రైల్వేస్టేషన్ మరియు బహిరంగ ప్రదేశాల్లో అనాథలుగా సంచరిస్తున్న మానసిక వికలాంగులను మనోబంధు ఫౌండేషన్ సభ్యులు గుర్తించి మానవతా దృక్పథంతో కడప పునరావాస కేంద్రానికి తరలించారు. ఫౌండేషన్ అంబులెన్స్ ద్వారా వీరికి సురక్షిత రవాణా కల్పించి, అక్కడ వైద్య పరీక్షలు, ఆశ్రయం, ఆహారం అందించే ఏర్పాట్లు చేశారు.ఈ సందర్బంగా మనోబంధు ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, సమాజంలో నిరాశ్రయుల పట్ల ప్రతి ఒక్కరూ స్పందించాలని కోరారు.ఇలాంటి వ్యక్తులు ఎక్కడైనా కనిపించినప్పుడు వెంటనే మా ఫౌండేషన్ ప్రతినిధులకు సమాచారం అందించి నిరాశ్రాయులకు అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు కృష్ణారెడ్డి, సురేష్, బాల తదితరులు పాల్గొని మానసిక వికలాంగులను సురక్షితంగా తరలించారు.ఈ కార్యక్రమంలో MRPS చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షులు ఎంపీ ప్రకాష్, మహిళా సేవకురాలు ఉన్నామలై, జనసేన పార్టీ నాయకులు మంజునాథ్ మరియు పోలీస్ శాఖ సిబ్బంది సహకరించారు.ఈ సందర్బంగా MRPS జిల్లా అధ్యక్షులు ఎంపీ ప్రకాష్ మాట్లాడుతూ ఈ సేవ కార్యక్రమానికి సహకరించిన స్థానిక ప్రజలకు, సంభందిత అధికారులకు మనోబంధు ఫౌండేషన్ ప్రతినిధులకు అయన కృతజ్ఞతలు తెలిపారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )