కె24న్యూస్ తెలుగు ఆగష్టు 13. చిత్తూరు జిల్లా కుప్పం మండలం వసనాడు గ్రామంలో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఆధునిక డ్రోన్ల ద్వారా క్రిమిసంహారక మందుల పిచికారీపై రైతులకు ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహించారు. డ్రోన్ టెక్నాలజీతో తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో ఎక్కువ విస్తీర్ణంలో మందులు పిచికారీ చేయవచ్చని అధికారులు వివరించారు. ఎనిమిది గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, ప్రభుత్వ పథకాలను రైతులకు అనుసంధానం చేయడం దీని ముఖ్య ఉద్దేశం.ఈ కార్యక్రమంలోAMC చైర్మన్ రాజు, వైసెచైర్మన్ శరవణ, క్లస్టర్ ఇంచార్జి శ్రీనివాసులు, నాగరాజు, వాళ్లేప్ప,నరేంద్ర, పల్లవి, కాడా పిడి, నీతి ఆయోగ్ ప్రతినిధులు సోమనాథ చౌదరి, డైరెక్టర్ అంకిత్ చైత్రి, వ్యవసాయ శాఖ నుంచి మండల వ్యవసాయ అధికారి,ఉద్యానవన శాఖ నుంచి హార్టికల్చర్ ఏడీ, సెరికల్చర్ శాఖ నుంచి ఏడీ మోహన్ బాబు, సెర్ప్ నుంచి ఏరియా కోఆర్డినేటర్,రెస్కో నుంచి ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.