కె24న్యూస్ తెలుగు ఆగష్టు 11. చిత్తూరు జిల్లా కుప్పం ఆర్అండ్బీ అతిథి గృహంలో ఎస్టీ కమిషన్ సభ్యులు వెంకటప్పను ఎమ్మార్పీఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి గిరిజనుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలోని గిరిజన కుటుంబాలు భూమి, ఇళ్ల స్థలాలు, విద్య, ఉపాధి మరియు మౌలిక వసతుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని MRPS చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షులు ఎంపీ ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి గిరిజనుడికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజనుల సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని వారు ఎస్టీ కమిషన్ సభ్యులను అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గం కో-ఇంచార్జి పి.వెంకటేష్ మాదిగ, రామకుప్పం మండల ఇంచార్జి గోవిందప్ప మాదిగ, మండల అధ్యక్షులు జయప్ప మాదిగ, శంకర్ తదితర MRPS నాయకులు పాల్గొన్నారు.