Logo
Date of Publish : 22 August 2026, 1:41 pm
Editor : Katta Ravindar

శ్రీఆనంద నిలయ అనాధ ఆశ్రమం ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం

కె24న్యూస్ తెలుగు ఆగష్టు 22. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం పెద్దమిట్టపల్లిలోని శ్రీఆనంద నిలయ అనాథ ఆశ్రమంలో శనివారం అన్నదానం, యోగా మరియు ధ్యాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆశ్రమ కార్యనిర్వాహకురాలు బండి కృష్ణవేణి పర్యవేక్షణలో ఈ సేవ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. వెంకటాపురం మీనాక్షిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు హేమలత, నరేష్ లు అన్నదాన వితరణ చేశారు.ఈ సందర్బంగా కార్యనిర్వాహకురాలు బండి కృష్ణవేణి మాట్లాడుతూ తిరుపతిలో నిర్వహించే ధ్యాన మహాయజ్ఞం 23వ తేది నుండి 29వ తేది వరకు జరిగే ప్రపంచ శాంతి కోసం నిర్వహిస్తున్న మహాయజ్ఞ కార్యక్రమానికి అందరిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భానుమతి, కామాక్షిరెడ్డి, బండి పట్టాభిరెడ్డి, రఘునాథరెడ్డి, మాధవిలత, కె బాబు రెడ్డి పలువురు ప్రముఖులు పాల్గొని అనాథలకు భోజనం వడ్డించారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )