
కె24న్యూస్ తెలుగు ఆగష్టు 14. చిత్తూరు జిల్లా MRPS మాజీ అధ్యక్షుడు ఎం.పీ.ప్రకాష్ ఆధ్వర్యంలో కుప్పం నియోజకవర్గ MRPS, MSP నాయకులు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద్ రావును మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. జిల్లాలో నిరుపయోగంగా మారిన అంబేద్కర్ భవనాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరారు.ఈ సందర్బంగా MRPS మాజీ జిల్లా అధ్యక్షులు ప్రకాష్ మాట్లాడుతూ డాక్టర్ BR అంబేద్కర్ ఆశయాలు ప్రతి గ్రామానికి, ప్రతి పేద కుటుంబానికి చేరాలంటే ఆయన పేరుతో నిర్మించిన భవనాలు ప్రజల అవసరాలకు ఉపయోగపడాలన్నారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాలు అసంపూర్తిగా ఉండటంపై నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎంపీ హామీ ఇచ్చినట్లు MRPS, MSP నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో MRPS కుప్పం నియోజకవర్గ కో-ఇంచార్జి పి.వెంకటేష్, రామకుప్పం MSP ఇంచార్జి గోవిందప్ప, శంకర్, గణేష్, కళ్యాణ్ తదితర దళిత నాయకులు పాల్గొన్నారు.