కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) సెప్టెంబర్ 22. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ SC దళితవాడకు ఎమ్మార్పీఎస్ విజ్ఞప్తి మేరకు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు రమ్య-కావ్యలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.రమ్య–కావ్యల పరిస్థితిని ఎమ్మార్పీఎస్ నాయకులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా, స్పందించిన ఎంపీ వెంటనే వారికి అండగా నిలిచారు. వారి చదువుకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.ఈ సందర్భంగా రమ్య–కావ్యలకు ధైర్యం చెబుతూ, మీ కష్టాలు మీ చదువుకు అడ్డంకి కాకూడదు, బాగా చదువుకుని జీవితంలో ఉన్నతంగా ఎదగాలి మీ భవిష్యత్తుకు అండగా ఉంటాంమని ఎంపీ మనోధైర్యాన్ని కల్పించారు. ఎమ్మార్పీఎస్ నాయకులు సమస్యను ఎంపీ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి, కేవలం మాటలకే పరిమితం కాకుండా స్వయంగా వారి ఇంటికి వెళ్లి పరామర్శించి, ఆర్థిక సహాయం అందించి, భవిష్యత్తుకు భరోసా కల్పించిన ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారికి కుప్పం నియోజకవర్గ ఎమ్మార్పీఎస్, బహుజన సేన, భారతీయ అంబేద్కర్ సేన మరియు దళిత సంఘాల నాయకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఒకరి సహాయం ఒకరోజు అవసరాన్ని తీర్చవచ్చు. కానీ సమాజం మొత్తం అండగా నిలిస్తే వారి జీవితాన్నే మార్చవచ్చు. అందుకే రమ్య–కావ్యల విద్య, భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ తమకు చేతనైన సహాయం, ప్రోత్సాహం అందించాలని దళిత సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ నాయకుల విజ్ఞప్తికి స్పందించి, బాధితుల ఇంటికి స్వయంగా వెళ్లి ఆర్థిక సహాయం అందించి, వారి భవిష్యత్తుకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కుప్పం నియోజకవర్గ కో-ఇన్‌చార్జ్ వెంకటేష్ మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు గోవిందప్ప మాదిగ, ఎమ్మార్పీఎస్ చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షులు ఎంపీ ప్రకాష్ మాదిగ, దళిత సీనియర్ నాయకులు బాలచంద్రబాబు, బహుజన సేన కుప్పం నియోజకవర్గ ఇన్‌చార్జ్ మహేష్ కుమార్, రామకుప్పం మండల అధ్యక్షులు విజయ్ కుమార్, మైనారిటీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మన్సూర్ భాష, శంకర్, గణేష్, నాగార్జున, బాలు పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.