Logo
Date of Publish : 03 August 2026, 2:03 pm
Editor : Katta Ravindar

ఎస్సీ/ఎస్టీ కమిటీ సమావేశాలు నిర్వహించాలని డీఆర్వోకు ఎమ్మార్పీఎస్ నాయకులు వినతి

కె24న్యూస్ తెలుగు ఆగష్టు 03. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో కుప్పం ఎమ్మార్పీఎస్ నాయకులు డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని 32 మండలాల్లో ఎస్సీ/ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించి, దళితులు మరియు గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై తక్షణ పరిష్కారం చూపాలని కోరారు. ఈ సందర్బంగా MRPS చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షులు ఎంపీ ప్రకాష్ మాట్లాడుతూ బైరెడ్డిపల్లి మండలంలో ఇటీవల జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గం కో-ఇంచార్జి పి.వెంకటేష్, బి.గోవిందప్ప, మహాజన సోషలిస్టు పార్టీ మండల అధ్యక్షులు జయప్ప, శంకర్ మరియు గణేష్ పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )