Logo
Date of Publish : 04 October 2026, 8:37 am
Editor : Katta Ravindar

కనిపించకుండా పోయిన సుమారు 900 గ్రాముల బంగారు ఆభరణాలను

 

మూడు గంటల వ్యవధిలో కనిపెట్టి భాదితులుకు అప్పజెప్పిన సాలూరు టౌన్ పోలీసులు

సాలూరు తెలుగు కే న్యూస్ ప్రతినిధి అక్టోబర్3:-

సాంకేతిక, భౌతిక విశ్లేషణ ద్వారా చాకచక్యంగా దర్యాప్తు
సుమారు కోటి రూపాయుల విలువగల బంగారు ఆభరణాలు కనిపెట్టి యజమానులకు అప్పగింత
సుమారు 900 గ్రాముల బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగు(సుమారు కోటి రూపాయల విలువ,కనిపించకుండా పోయిన ఘటనలో సాలూరు టౌన్ పోలీసులు అత్యంత వేగంగా స్పందించి, సాంకేతిక ఆధారాల విశ్లేషణతో పాటు క్షేత్రస్థాయిలో చేపట్టిన విస్తృత తనిఖీలను సమన్వయం చేస్తూ కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఆ బ్యాగును గుర్తించి సురక్షితంగా బాధితుడికి అప్పగించారు. 03.10.2026 మధ్యాహ్నం సుమారు 12.00 గంటలకు, సాలూరు పట్టణానికి చెందిన ఒక వ్యక్తి సాలూరు లోని ఒక బ్యాంకు లాకెర్ నుండి వారికి సంభందించిన సుమారు 900 గ్రాముల బంగారు ఆభరణాలు సొంత అవసరాల నిమిత్తం తన ద్విచక్ర వాహనంపై తీసుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో, తన వద్ద ఉన్న సుమారు 900 గ్రాములు బంగారు ఆభరణాల బ్యాగును ద్విచక్ర వాహనం హుక్‌కు తగిలించుకుని కోట జంక్షన్ నుండి సాలూరు పట్టణంలోని తెలగ వీధి వైపు వెళ్తుండగా, మార్గమధ్యలో ఆ బ్యాగు తెగి పడిపోయి కనిపించకుండా పోయినట్లు గుర్తించాడు.దీంతో బాధితుడు వెంటనే సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి, తన బంగారు ఆభరణాల బ్యాగును గుర్తించి అప్పగించాల్సిందిగా పోలీసులను కోరారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి, ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ ఎం. వెంకటేశ్వర రావు మార్గదర్శకత్వంలో బంగారు ఆభరణాల బ్యాగును గుర్తించేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.ఒక బృందాన్ని టెక్నికల్ ఎవిడెన్స్ సేకరణ మరియు విశ్లేషణ కోసం, మరో బృందాన్ని ఫిజికల్ ఎవిడెన్స్ మరియు క్షేత్రస్థాయి తనిఖీల కోసం నియమించారు. ఫిజికల్ ఎవిడెన్స్ బృందం సంఘటనకు సంబంధించిన మార్గంలో ఇంటింటికీ వెళ్లి విచారణ చేస్తూ, సీసీ కెమెరాలు మరియు ఇతర ఆధారాలను పరిశీలిస్తూ ముందుకు సాగింది. అదే సమయంలో టెక్నికల్ బృందం అందుబాటులో ఉన్న సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తూ, బ్యాగు మరియు ద్విచక్ర వాహనం కదలికలను ట్రాక్ చేసింది.టెక్నికల్ బృందం అందించిన సమాచారంతో, బంగారు ఆభరణాల బ్యాగు ద్విచక్ర వాహనంతో కలిసి పెదకోమటిపేట రామమందిరం వరకు వెళ్లినట్లు గుర్తించారు. ఆ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఫిజికల్ ఎవిడెన్స్ బృందం పెదకోమటిపేట రామమందిరం నుండి తెలగ వీధి వరకు తనిఖీలను ముమ్మరం చేశారు.ఈ క్రమంలో డబ్బి వీధి ప్రాంతంలో విచారణ చేస్తూ ఆ ప్రాంతానికి చెందిన ఒక మహిళను అడుగగా ఆమె తనకు దొరికిన బ్యాగును అప్పజెప్పింది. పోలీసులు ఆమె వద్ద ఉన్న బ్యాగును వశపర్చుకొని, బ్యాగులో ఫిర్యాదుదారుడు పేర్కొన్న బంగారు ఆభరణాలు ఉన్నట్లు నిర్ధారించారు. ఈ విధంగా సాలూరు టౌన్ పోలీసులు ఫిర్యాదు అందిన సుమారు మూడు గంటల వ్యవధిలోనే సుమారు 900 గ్రాముల బంగారు ఆభరణాల బ్యాగును విజయవంతంగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.టెక్నికల్ బృందం మరియు ఫిజికల్ ఎవిడెన్స్ బృందం సమన్వయంతో, వేగవంతంగా స్పందించి విలువైన బంగారు ఆభరణాలను మూడు గంటల వ్యవధిలో గుర్తించి స్వాధీనం చేసుకొని, స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాల బ్యాగును పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి, ఐపీఎస్ చేతుల మీదుగా ఫిర్యాదుదారునికి అప్పగించారు. తన విలువైన బంగారు ఆభరణాలు సురక్షితంగా తిరిగి లభించడంతో బాధితుడు ఆనందం వ్యక్తం చేసి సాలూరు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సంఘటనలో సాంకేతిక ఆధారాలను సమర్థవంతంగా వినియోగించడం, క్షేత్రస్థాయిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం మరియు రెండు బృందాల సమన్వయంతో పనిచేయడం ద్వారా కేవలం మూడు గంటల్లోనే బంగారు ఆభరణాలను గుర్తించిన సాలూరు పట్టణ సిఐ అప్పలనాయుడు, ఎస్సై అనిల్ కుమార్, సిబ్బంది రాంబాబు,అప్పన్న జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి, ఐపీఎస్ ప్రత్యేఖంగా అభినందించారు..


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )