కె24న్యూస్ తెలుగు జూలై 14. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని వినాయక సదన్‌లో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకరరావు 71వ ముందస్తు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఈడిగ గౌడ్ సంఘం అధ్యక్షులు మద్దిలేటి కృష్ణమూర్తి గౌడ్, ఏపీ గౌడ్ సంఘం కార్యదర్శి బుస్సా నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శంకరరావును శాలువా, గజమాలతో సత్కరించారు. పలువురు గౌడ సంఘం నాయకులు, ప్రతినిధులు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.