Logo
Date of Publish : 15 August 2026, 10:22 am
Editor : Katta Ravindar

కుప్పం మండలం పొన్నాంగూరులో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

కె24న్యూస్ తెలుగు ఆగష్టు 15. చిత్తూరు జిల్లా కుప్పం మండలం మల్లనూరు పంచాయతీ పరిధిలోని పొన్నాంగూరు గ్రామ మోడల్ ప్రైమరీ స్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల హెచ్‌ఎం ప్రియాంక అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. విద్యార్థులు జై హింద్ నినాదాలతో దేశభక్తిని చాటుతూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి పోరాటాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛను అనుభవిస్తున్నామని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఎంసీ చైర్మన్ ఎంపీ ప్రకాష్ పాల్గొని మాట్లాడుతూ, విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగడంతో పాటు బాధ్యతగల పౌరులుగా తయారై సమాజానికి, దేశానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని, క్రమశిక్షణ, విద్య, సేవాభావంతో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పంచాయతీ పార్టీ ఉపాధ్యక్షులు రాజ్‌కుమార్ విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో క్లస్టర్ కో-ఇన్‌చార్జ్ విభూషణ్, యూనిట్ ఇన్‌చార్జ్ దామోదర్, పంచాయతీ పార్టీ అధ్యక్షులు రమేష్, సతీష్, మోడల్ ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయురాలు మహేశ్వరి, అంగన్వాడి టీచర్ కస్తూరి,పాఠశాల తల్లిదండ్రుల బృందం సభ్యులు కవిత, విజయ్, సత్య, జయలక్ష్మి, మురుగేష్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేశారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )