Logo
Date of Publish : 28 July 2026, 1:13 pm
Editor : Katta Ravindar

కుప్పం సమస్యలపై సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు!

కె 24న్యూస్ తెలుగు జూలై 28. కుప్పం నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారం కోసం ఎమ్మార్పీఎస్ నాయకులు ఏపీ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎస్సీ వర్గాల సంక్షేమం, భూ సమస్యలు, చెరువుల ఆక్రమణలు, నిరుపేదలకు న్యాయం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వినతిపత్రాన్ని స్వీకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మార్పీఎస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షులు ఎం.పీ. ప్రకాష్ మాదిగ, నియోజకవర్గ కో-ఇన్‌చార్జ్ పి.వెంకటేష్ మాదిగ, రామకుప్పం మండలం సీనియర్ నాయకులు గోవిందప్ప మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ మండలం అధ్యక్షులు జయప్ప మాదిగ, శంకర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )