Logo
Date of Publish : 23 July 2026, 1:25 am
Editor : Katta Ravindar

కె 24 తెలుగు న్యూస్ ప్రతినిధి సతీష్ చారీ ప్రజల ప్రాణాలతో చెలగాటం… గుంతల రహదారిపై నిరసన!

[caption id="attachment_4291" align="alignleft" width="1920"] నిజామాబాద్ జిల్లా,నవీపేట్ మండల కేంద్రంలోని:- ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డంతా భారీ గుంతలతో నిండిపోవడంతో వాహనదారులు నిత్యం ప్రమాదాల మధ్య ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.
రహదారిపై ఉన్న గుంతలను నిరసనగా మొక్కలు నాటి స్థానికులు వినూత్నంగా ఆందోళన చేపట్టారు. ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ వందలాది వాహనాలు ఈ రహదారిపై ప్రయాణిస్తున్నప్పటికీ మరమ్మతుల విషయంలో నిర్లక్ష్యం కొనసాగుతోందని మండిపడ్డారు.
వర్షపు నీటితో గుంతలు కనిపించక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని, అత్యవసర సేవలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు తెలిపారు. వెంటనే రహదారిని పూర్తిగా మరమ్మతు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని అధికారులను డిమాండ్ చేశారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )