Logo
Date of Publish : 05 August 2026, 8:14 am
Editor : Katta Ravindar

కె 24 తెలుగు న్యూస్ ప్రతినిధి సతీష్ చారీ ఆగస్టు 10 ‘జైలు భరో’ను విజయవంతం చేయండి: సీఐటీయూ, రైతు సంఘం పిలుపు

[caption id="attachment_4889" align="alignleft" width="1080"] నిజామాబాద్ జిల్లా,నవీపేట్, ఆగస్టు 5: ఆగస్టు 10న నిర్వహించనున్న 'జైలు భరో' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు నవీపేట్ మండల కేంద్రంలో బుధవారం సంయుక్త జీపు జాత నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులు, కార్మికులు, కర్షకుల ప్రయోజనాలను విస్మరిస్తూ కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చిందని విమర్శించారు. దీంతో కార్మికుల పనివేళలు పెరుగుతున్నప్పటికీ వేతనాల్లో పెరుగుదల లేదన్నారు. రైతాంగానికి వ్యతిరేకంగా విత్తన సవరణ బిల్లు, విద్యుత్ సవరణ బిల్లులను తీసుకురావడం సరికాదని, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే చర్యలు పేదల ఉపాధి భద్రతకు విఘాతం కలిగిస్తాయని అన్నారు.
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జయశంకర్ గౌడ్ మాట్లాడుతూ లేబర్ కోడ్ల అమలుతో కార్మిక వర్గం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దేవేందర్ సింగ్, పీఎన్‌ఎం జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ప లింగం, సీఐటీయూ జిల్లా నాయకులు నాయక్‌వాడి శ్రీనివాస్, గణేష్ గుప్తా, మేకల ఆంజనేయులు, మండల ప్రజాసంఘాల నాయకులు గౌతమ్, వసంతు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )