కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) సెప్టెంబర్ 13. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని సుబ్రమణ్యస్వామి ఆలయంలో మాదిగ సోదరుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాదిగ సమాజ ఐక్యత, చైతన్యం, గ్రామస్థాయి సమస్యలు, భవిష్యత్ సామాజిక కార్యాచరణపై అర్థవంతమైన చర్చ జరిగింది. సమాజం బలోపేతం కావాలంటే గ్రామస్థాయిలో ఐక్యత, చైతన్యం, నాయకత్వం బలపడాలని నాయకులు పేర్కొన్నారు. ప్రతి గ్రామంలోని సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా సమాజ ప్రయోజనానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని సూచించారు. మాదిగ సమాజంలో ఐక్యతను మరింత బలోపేతం చేస్తూ, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయడంతో పాటు, గ్రామస్థాయి నుంచే సమర్థవంతమైన నాయకత్వాన్ని తీర్చిదిద్దాలని నిర్ణయించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ కో-ఇన్చార్జ్ వెంకటేష్ మాదిగ, మహాజన సోషలిస్టు పార్టీ సీనియర్ నాయకులు గోవిందప్ప మాదిగ, ఎంఆర్పీఎస్ చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షులు ఎంపీ ప్రకాష్, రామకుప్పం మండల అధ్యక్షులు విజయ్ కుమార్ మాదిగ, మాదిగ యువసేన అధ్యక్షుడు పలని మాదిగ, రెస్కో డైరెక్టర్ గడ్డూరు సతీష్, వికలాంగుల మండల అధ్యక్షుడు వేణప్ప, రవి మాదిగ, రమేష్, వెంకటేష్, ఎంఎస్పీ మైనార్టీ నాయకులు నాసిర్ భాష, రిజ్వాన్ భాషా, వాజిద్ భాష, ముబారక్ భాషా, కుప్పం మండల మాజీ వార్డు మెంబర్ నరసింహులు మాదిగ, కుప్పం నియోజకవర్గ ఎంఆర్పీఎస్ యువ నాయకుడు కుమార్, కుప్పం మండల అధ్యక్షులు రాజేష్, రంగప్ప, కేశవులు, బాబు, ముని వెంకటప్ప, తదితరులు పాల్గొన్నారు.