Logo
Date of Publish : 14 July 2026, 6:05 pm
Editor : Katta Ravindar

పవన్ కళ్యాణ్ కోలుకోవాలని బంగారుపాళెంలో జనసేన నాయకులు ప్రత్యేక పూజలు!

కె 24న్యూస్ తెలుగు జూలై 14. చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలం మడుపోలూరు సమీపంలోని వసంతాపురం గ్రామంలో వెలసిన శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పూల చైతన్య మోహన్ రాయల్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, ప్రత్యంగిరా మరియు మృత్యుంజయ హోమాలు నిర్వహించారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ పూజల అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. పలమనేరు జనసేన నాయకులు నాగరాజు, మురాదు భార్గవ్, పవన్, నాని, రమేశ్, ఆలయం ధర్మకర్త శివాజీ స్వామి, టిడిపి నాయకులు శివరాజ్, బాల, సతీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )