కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) సెప్టెంబర్ 07. స్వర్ణ గ్రామ్ / స్వర్ణ వార్డు సచివాలయాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పెన్షన్ దరఖాస్తులను సెప్టెంబర్ 07 నుండి దరఖాస్తుల స్వీకరణ మరియు eKYC ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈ సందర్బంగా గంగాధరనెల్లూరు జనసేన పార్టీ మండల అధ్యక్షులు DS@సురేష్ రెడ్ది మాట్లాడుతూ అర్హత కలిగిన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత/చేనేత కార్మికులు, మత్స్యకారులు మొదలైన వారు పెన్షన్ కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసి అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ పొందాలన్నారు.అలాగే ముఖ్యంగా పెన్షన్ ఇప్పిస్తామంటూ డబ్బులు అడిగే వారిని నమ్మొద్దని మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా సందేహలుంటే సచివాలయ అధికారులను సంప్రదించాలని ఒక ప్రకటనలో తెలిపారు.