కె24న్యూస్ తెలుగు ఆగష్టు 07.చిత్తూరు జిల్లా రామకుప్పం మండల కేంద్రంలో MRPS,MSP నాయకుల ఆధ్వర్యంలో MRPS కుప్పం నియోజకవర్గ కో-ఇంచార్జ్ పి.వెంకటేష్ అధ్యక్షతన ఆరోగ్యశ్రీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మొదటగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి గౌరవం వందనం తెలిపారు. ఈ సందర్బంగా MRPS చిత్తూరు జిల్లా ఇంచార్జ్ ధనరాజుపల్లి కిషోర్ మాదిగ మాట్లాడుతూ పేదల ఆరోగ్య హక్కు కోసం జరిగిన పోరాటాల ఫలితమే ఆరోగ్యశ్రీ అని కొనియాడారు. పేద ప్రజలు అనారోగ్యానికి గురైనప్పుడు ఖరీదైన వైద్యం చేయించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో, పేదలకు కూడా మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో జరిగిన సామాజిక ఉద్యమాలు, పోరాటాలు ఎంతో కీలక పాత్ర పోషించాయని, డబ్బు లేక ఏ పేదవాడూ ప్రాణాలు కోల్పోకూడదనే ఉద్దేశంతో ఈ పథకం రూపుదిద్దుకుందని ఎంఆర్పీఎస్ చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షులు ఎంపీ ప్రకాష్ ఈసందర్బంగా గుర్తుచేశారు.పేదవాడికి కూడా ధనికుడితో సమానంగా మెరుగైన వైద్యం అందాలి, డబ్బులేక వైద్యం అందక ఏ ఒక్క పేద ప్రాణం కోల్పోకూడదనే లక్ష్యంతో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పేదల ఆరోగ్య హక్కుల కోసం గళమెత్తి పోరాటం చేశారని కిషోర్ మాదిగ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్ట్ పార్టీ మండల ఇంచార్జ్ గోవిందప్ప మాదిగ, ఎంఎస్పీ మండల అధ్యక్షులు జయప్ప మాదిగ, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు విజయ్ కుమార్, , ఎంఆర్పీఎస్ కుప్పం మండల అధ్యక్షులు కె. రాజేష్, మైనార్టీ మండల అధ్యక్షులు నాసిర్, రియాజ్, రమేష్, శంకర్ గణేష్, రవిబాబు, వేనన్న,వెంకటేష్, జనసేన భాస్కర్, రిజ్వాన్, ఫయాజ్ వాషీద్ మన్సూర్, మున్ని భాష, ఆఫీస్ భాషా, ముజ్జు భాష,ఎంఆర్పీఎస్–ఎంస్పీ నాయకులు, కార్యకర్తలు, మైనార్టీ నాయకులు, సామాజికవేత్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆరోగ్యశ్రీ దినోత్సవాన్ని విజయవంతం చేశారు.