
కె24న్యూస్ తెలుగు జూన్ 25. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం కలిజవేడు నాశంపల్లి AAW గ్రామానికి చెందిన తగిరు జయచంద్ర-సుజాత దంపతుల కుమారుడు తగిరు బాలాజీ (27 సం!!) అదే గ్రామానికి చెందిన ఓ రైతు దగ్గర కూలిగా పనిచేస్తూ జీవనం సాగిస్తూ కుటుంబానికి చేదోడు వాడొడుగా ఉంటుండేవాడు. ఈ క్రమంలోనే మామిడి కాయలను అన్లోడ్ చేసి తిరుగుప్రయాణంలో బుధవారం రాత్రి ట్రాక్టర్ అదుపు తప్పటంతో గాయపడిన డ్రైవర్ తగిరు బాలాజీ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు,యువత తీవ్ర సంతాపం తెలిపారు. ఏకైక కుమారుడిని కోల్పోయిన ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు, యువత తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.