Logo
Date of Publish : 27 September 2026, 10:49 pm
Editor : Katta Ravindar

బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ అయితే ఆందోళన చెందవద్దని తెలిపిన SP

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) సెప్టెంబర్ 27. చిత్తూరు జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ తుషార్ డూడి, IPS గారు బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ అయిన సందర్భంలో తీసుకోవాల్సిన చర్యలు, పాటించాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమైన సూచనలు చేశారు. వెంటనే సంబంధిత బ్యాంకు అధికారులను సంప్రదించి ఫ్రీజ్ కావడానికి గల కారణాలను తెలుసుకోవాలని సూచించారు. లావాదేవీల రసీదులు, యూపీఐ వివరాలను దర్యాప్తు అధికారులకు సమర్పించాలని పేర్కొన్నారు. ఖాతా అన్ఫ్రీజ్ చేస్తామని చెప్పే మోసగాళ్ల మాటలు నమ్మి డబ్బులు చెల్లించి మోసపోవద్దని చిత్తూరు జిల్లా ప్రజలను ఎస్పీ హెచ్చరించారు.ఖాతా ఫ్రీజ్‌కు సంబంధించిన సమస్యపై ఖాతాదారుడు సంబంధిత బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్‌కు లిఖితపూర్వకంగా దరఖాస్తు (Grievance/Representation) సమర్పించాలి. దరఖాస్తులో ఖాతా వివరాలు, ఖాతాపై విధించిన ఫ్రీజ్/లియన్ వివరాలు, సంబంధిత రిఫరెన్స్ నంబర్, లావాదేవీల వివరాలు మరియు తమ వద్ద ఉన్న సంబంధిత ఆధారాలను జత చేయాలి. ఖాతాదారుడు సమర్పించిన దరఖాస్తు ఆధారంగా సంబంధిత బ్యాంక్ మేనేజర్ GRM (Grievance Redressal Mechanism) పోర్టల్‌లో ఫిర్యాదును నమోదు చేస్తారు. GRMలో ఫిర్యాదు నమోదు చేసిన అనంతరం Acknowledgement / Reference Number తప్పనిసరిగా తీసుకుని భద్రపరచుకోవాలి. తదుపరి అవసరమైన సమాచారాన్ని లేదా పత్రాలను సంబంధిత బ్యాంకు/అధికారులు కోరినప్పుడు సమర్పించాలి. దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలి. తమ ఖాతాలోకి డబ్బు ఎలా వచ్చింది, ఎవరి నుంచి వచ్చింది, ఏ కారణంతో లావాదేవీ జరిగింది వంటి వివరాలను సంబంధిత ఆధారాలతో స్పష్టంగా తెలియజేయాలి. సంబంధిత అధికారులు అందించిన సమాచారం మరియు ఆధారాలను పరిశీలించి, దర్యాప్తు మరియు చట్టపరమైన ప్రక్రియకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటారు. ఖాతా ఫ్రీజ్ అయిన వెంటనే స్వయంచాలకంగా అన్‌ఫ్రీజ్ అవుతుందని భావించకూడదు. ఖాతాపై విధించిన ఆంక్షకు కారణమైన సంబంధిత బ్యాంకు/చట్టపరమైన/దర్యాప్తు ప్రక్రియ ప్రకారం తదుపరి చర్యలు కొనసాగుతాయి. బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ అయిందని చెప్పి డబ్బులు చెల్లిస్తే వెంటనే ఖాతాను అన్‌ఫ్రీజ్ చేస్తాం అని చెప్పే వ్యక్తులను నమ్మకూడదని. పోలీసుల పేరుతో, బ్యాంకు అధికారుల పేరుతో లేదా సైబర్ క్రైమ్ అధికారుల పేరుతో ఎవరైనా వ్యక్తిగత ఖాతాలకు డబ్బులు పంపాలని కోరితే అప్రమత్తంగా ఉండాలని, తమ బ్యాంక్ ఖాతాకు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన డబ్బును ఇతర ఖాతాలకు బదిలీ చేయకూడదు. కమిషన్ కోసం తమ బ్యాంక్ ఖాతాను ఉపయోగించడానికి అనుమతించకూడదు. OTP, UPI PIN, ATM PIN, CVV, Net Banking Password వంటి రహస్య వివరాలను ఎవరికీ వెల్లడించకూడదు. అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే వెంటనే బ్యాంకును లేదా సైబర్ పోలీసులను సంప్రదించి. ఆన్‌లైన్ ఆర్థిక మోసానికి గురైన వ్యక్తులు ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలి. అలాగే National Cyber Crime Reporting Portal – cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలి. మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేయడం ద్వారా సంబంధిత లావాదేవీలపై సకాలంలో చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రజలు తమ బ్యాంక్ ఖాతాలను ఇతరులకు ఉపయోగించడానికి ఇవ్వకుండా, ప్రతి ఆన్‌లైన్ లావాదేవీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లావాదేవీల విషయంలో వెంటనే సంబంధిత బ్యాంకు మరియు పోలీసు అధికారులను సంప్రదించాలని జిల్లా ఎస్పీ సూచించారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )