
కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) ఆగష్టు30. బెంగళూరు గ్రామాంతర ప్రాంతంలో జరిగిన వివాహ వేడుకలో MRPS చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షులు ఎంపీ ప్రకాష్ పద్మశ్రీ మందకృష్ణ మాదిగను ఆత్మీయంగా కలుసుకుని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ నాయకత్వం తనకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని ప్రకాష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ MRPS కో-ఇన్‌చార్జ్ వెంకటేష్, మహాజన సోషలిస్టు పార్టీ కుప్పం నియోజకవర్గ సీనియర్ నాయకులు గోవిందప్ప, MRPS మండల అధ్యక్షులు విజయ్ కుమార్, శంకర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.