Logo
Date of Publish : 15 June 2026, 1:49 pm
Editor : Katta Ravindar

మద్యానికి బానిసై చెరువులో దూకి వ్యక్తి మృతి.

తవణంపల్లి జూన్ 15
( తెలుగు కే న్యూస్) :

తవణంపల్లి మండల కేంద్రంలోని తెల్లగుండ్లపల్లి అరుంధతి వాడ గ్రామానికి చెందిన రవి 52, చెరువులో దూకి మృతి చెందడం జరిగింది. ఈ సందర్భంగా తవణంపల్లి ఎస్సై రమేష్ బాబు వివరాల మేరకు తెల్ల గుండ్లపల్లి అరుంధతి వాడ గ్రామానికి చెందిన రవి 52,తండ్రి మునస్వామి, మృతుడు రవికి మద్యం అలవాటు ఉండేది. గత ఆరు నెలల క్రితం మద్యానికి బానిసై మద్యం మత్తులో ఉన్నప్పుడు అతను తెల్ల గుండ్లపల్లి సమీపంలో ఉన్న చెరువులో చెరువులో దూకాడు. ఆ సమయంలో స్థానికులు చూసి వెంటనే అతనిని రక్షించడం జరిగింది. అయినా మృతుడు తీరు మారలేక మద్యం చెడు అలవాటుకు లోనై సోమవారం అతని తండ్రి మునస్వామి తండ్రి దగ్గరికి వెళ్లి వెంటనే డబ్బు కావాలని అడిగాడు. తండ్రి తన దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో వెంటనే రవి అసహనానికి గురై ఎవరు డబ్బు ఇవ్వకపోవడంతో అతను తీవ్ర నిరాశ,ఆవేదనకు గురై గ్రామ సమీపంలోని అదే చెరువులో నీటిలో దూకి మునిగిపోవడం జరిగింది. స్థానికులు కాపాడడానికి ప్రయత్నించగా వీలు కాకపోవడంతో, వెంటనే అగ్నిమాపక శాఖ, పోలీసుల సహాయంతో అతని మృతదేహాన్ని బయటకు తీయడం జరిగింది. ఊపిరి ఆడక అతను మరణించడం జరిగింది. ఈ విషయమై వారి కుమార్తె దీప ఇచ్చిన ఫిర్యాదు మేరకు తవణం పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తులో ఉందని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )