Logo
Date of Publish : 06 July 2026, 8:58 am
Editor : Katta Ravindar

మల్లనూరు పంచాయతీలో ఆరు అడుగుల కొండచిలువ, వణికిపోయిన స్థానికులు!

కె24న్యూస్ తెలుగు జూలై 06. చిత్తూరు జిల్లా కుప్పం మండలం మల్లనూరు పంచాయతీలోని కృష్ణాపురం, దుర్గసముద్రం రహదారి వద్ద ఆరు అడుగుల కొండచిలువ ప్రత్యక్షం కావడం స్థానికుల్లో తీవ్ర భయాందోళన నింపింది. విద్యార్థులు, రైతులు నిత్యం రాకపోకలు సాగించే ఈ మార్గంలో భారీ పాము కనిపించడంతో ప్రజలు వణికిపోయారు. వెంటనే అటవీశాఖ అధికారులు స్పందించి ఆ పామును సురక్షితంగా అడవిలోకి తరలించాలని కోరారు. ఎంఆర్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు ఎంపీ ప్రకాష్ మాట్లాడుతూ, ప్రజల భద్రత కోసం అటవీ అధికారులు ప్రత్యేక నిఘా ఉంచాలని, పత్తిచేను ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )