Logo
Date of Publish : 15 September 2026, 7:21 pm
Editor : Katta Ravindar

రమ్య,కావ్యల ఉన్నత విద్యతో పాటు భవిష్యత్తుకు అన్ని విధాలుగా అండగా ఎంపీ భరోసా!

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) సెప్టెంబర్15. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ SC దళితవాడకు చెందిన రమ్య, కావ్యలతో MRPS, బహుజన సేన నాయకుల సమక్షంలో ఫోన్ ద్వారా మాట్లాడి పరామర్శించిన ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు. మీ ఉన్నత విద్యకు నా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని, ప్రభుత్వ ద్వారా కూడా సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. తల్లిదండ్రుల అండ కోల్పోయిన రమ్య, కావ్యల ఉన్నత విద్యతో పాటు భవిష్యత్తుకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు గారు హామీ ఇవ్వడం అభినందనీయమని MRPS, బహుజన సేన నాయకులన్నారు. ప్రజాప్రతినిధి ఇచ్చే ఒక భరోసా మాట కష్టాల్లో ఉన్న కుటుంబానికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుందని చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షులు MP ప్రకాష్ మాదిగ అన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రమ్య,కావ్యల పరిస్థితిని కేవలం ఒక కుటుంబ సమస్యగా చూడకూడదని, ఇద్దరి బిడ్డలకు సమాజం మొత్తం అండగా నిలిచి, వారి చేతుల్లో పుస్తకాలు ఉండాలి, వారి కళ్లలో కన్నీళ్లు కాదు, ఉన్నత భవిష్యత్తు కలలు ఉండాలని, వారి చదువు ఆగిపోకుండా చూడటం మనందరి సామాజిక బాధ్యత అన్నారు. రమ్య,కావ్యలకు ఎంపీ ఇచ్చిన భరోసాను ఆచరణలోకి వచ్చి, వారి ఉన్నత విద్యకు నిరంతర సహకారం అందితే ఈ ఇద్దరు బిడ్డల జీవితాల్లో మంచి మార్పు వస్తుందని MRPS కుప్పం నియోజకవర్గ కో-ఇన్‌చార్జ్ వెంకటేష్ మాదిగ అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్యాపరమైన అవకాశాలు వారికి పూర్తిస్థాయిలో అందేలా సంబంధిత అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని MRPS, బహుజన సేన నాయకులు కోరారు. అనాథ బిడ్డలకు ఆసరా ఇవ్వడం కేవలం సహాయం కాదు, వారి భవిష్యత్తుపై సమాజం తీసుకునే బాధ్యత. రమ్య,కావ్యల చదువే వారి జీవితానికి వెలుగుగా మారాలి అని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు గోవిందప్ప మాదిగ, MRPS దళిత సీనియర్ నాయకులు బాలచంద్రబాబు, బహుజన సేన కుప్పం నియోజకవర్గ ఇన్‌చార్జ్ మహేష్ కుమార్, రామకుప్పం మండల అధ్యక్షులు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )