కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) సెప్టెంబర్ 22. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం కె.నాశంపల్లి గ్రామంలో వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా స్థానిక మాజీ సర్పంచ్ L.నీలావతి మరియు గంగాధరనెల్లూరు ప్రాథమిక హెల్త్ సెంటర్ డాక్టర్ ప్రవీణ్ లు పాల్గొన్నారు. క్యాంపు కో-ఆర్డినేటర్ జి.సతీష్ సారథ్యంలో ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం వరకు నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో క్యాన్సర్, గుండె, కిడ్నీ, ఎముకలు మరియు గ్యాస్టిక్, కండ్లు, చెవులు, నొప్పి సమస్యలతో బాధపడుతున్నవారికి అనుభవమున్న వైద్య నిపుణులతో చికిత్సను అందించారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి కలిజవేడు నాశంపల్లి చుట్టుపక్కల గ్రామాలనుండి అనారోగ్య సమస్యలున్న 100 మందికి పైగా పేద రోగులకు వివిధ వ్యాధులకు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేశారు. అవసరమైన వాళ్ళకి ఇ.సి.జి, ఎకో బి.పి టెస్ట్ లు ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కీమ్ ఇంచార్జ్ బి.వాసుదేవరెడ్డి, ఎకో కార్డియోగ్రాఫర్స్ ఎం.భవ్య శ్రీ, ఎన్.సంజన, డాక్టర్ నికిత, డాక్టర్ సమీర, డాక్టర్ యశస్ రెడ్డి,డాక్టర్ ప్రవీణ్ ఆర్థో, క్యాంపు కో-ఆర్డినేటర్ సాయి సతీష్, జీబి సురేష్, విజయ్ కుమార్, MLHP P.దానియేల్, ANM Y.Vమాధవి, ఆశ వర్కర్స్ C.ఈశ్వరి, G.చిట్టెమ్మ పాల్గొన్నారు.