Logo
Date of Publish : 18 July 2026, 9:30 am
Editor : Katta Ravindar

శ్రీవకుళ మాత ఆశ్రమాన్ని సందర్శించిన జనసేన నేత కంజేరి చంద్రశేఖర్!

కె24న్యూస్ తెలుగు జూలై 18. చిత్తూరు జిల్లాలోని ఎస్ఆర్ పురం మండలం మంగుంట గ్రామ పరిధిలోని శ్రీవకుళ మాత శ్రీకృష్ణ ఆశ్రమాన్ని జనసేన పార్లమెంటు పరిశీలకుల కమిటీ సభ్యులు కంజేరి చంద్రశేఖర్@చందు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆశ్రమానికి మైక్ సెట్, 20 కుర్చీలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. నిరాశ్రయులకు, పేదలైన అనాథలకు ఆశ్రయం కల్పిస్తున్న ఈ ఆశ్రమానికి తన వంతు సహాయం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆశ్రమ కార్యనిర్వాహకులు తులసమ్మ గంగిరెడ్డి, జనసేన నేతకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె.మురుగన్, రమేష్, నవీన్ రెడ్డి, టీ.సుబ్రహ్మణ్యం, మార్కొండయ్య, గురుస్వామి, మురగయ్య, తేజ తదితరులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )