కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) సెప్టెంబర్ 22. స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ సన్నద్ధం కావాలన్నా పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం కాకినాడలో జనసేన నేతలతో సమావేశం నిర్వహించారు. పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక సంస్థల ఎన్నికల కోసం నియమించిన సమన్వయకర్తలు, కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు, సపోర్ట్ టీం సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల సన్నాహలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్, నియోజకవర్గాలవారీగా నియమించిన కమిటీలు క్షేత్ర స్థాయిలో అనుసరించాల్సిన విధివిధానాలను తెలియచేశారని గంగాధరనెల్లూరు స్థానిక ఎన్నికల సంస్థల సమన్వయకర్త కంజేరి చందు@చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు.