Logo
Date of Publish : 29 September 2026, 3:08 pm
Editor : Katta Ravindar

స్వచ్ఛ రథం ద్వారా పొడి చెత్త సేకరణపై కొత్త ఆఫర్లు ప్రకటించిన ఎంపీడీవో

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) సెప్టెంబర్ 29. గంగాధరనెల్లూరు మండలంలో పరిసరాల పరిశుభ్రతను మెరుగుపరచడం లక్ష్యంగా ఎంపీడీవో మనోహర్ గౌడ్ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. స్వచ్ఛ రథం ద్వారా పొడి చెత్త సేకరణ అందించే కుటుంబాలకు కిలోకు అదనంగా నాలుగు రూపాయలు ప్రోత్సాహకం అందజేస్తామని తెలిపారు. అలాగే పది కేజీలకు పైగా చెత్త ఇస్తే ఉచితంగా లక్కీ డిప్ టోకెన్లు ఇస్తామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చెత్తను వేరుచేసి ఇచ్చే అలవాటును ప్రోత్సహించడానికి స్వచ్ఛ రథం వాహనం ద్వారా పొడి చెత్త సేకరణ మరియు ప్రత్యేక దసరా ధమాకా ఆఫర్‌ను అమల్లోకి తెచ్చినట్లు తెలిపారు.గ్రామస్తులు తమ ఇళ్లలోని ప్లాస్టిక్ సీసాలు, పాత పేపర్లు, అట్టపెట్టెలు, ఇనుము, కవర్లు వంటి పునర్వినియోగ పొడి చెత్తను (Dry Waste) పంచాయతీకి చెందిన స్వచ్ఛ రథం వాహనానికి ఇచ్చి, వాటి విలువకు తగిన నిత్యావసర సరుకులను లేదా నగదును పొందవచ్చు.ఈ దసరా ఆఫర్ వ్యవధిలో పొడి చెత్త అందించే ప్రతి కుటుంబానికి సాధారణ విక్రయ ధరపై కేజీకి అదనంగా ₹4 చొప్పున చెల్లించడం జరుగుతుంది.ఏదేని ఒక కుటుంబం నుండి 10 కేజీలకు పైగా పొడి చెత్తను స్వచ్ఛ రథానికి అందించినట్లయితే, వారికి ఒక లక్కీ డిప్ టోకెన్ ఉచితంగా ఇవ్వబడుతుంది.లక్కీ డిప్ టోకెన్ పొందిన వారిలో దసరా పండుగ సందర్భంగా ఎంపిక చేసిన విజేతలకు బహుమతులు అందజేస్తారు.ప్రథమ బహుమతి- రైస్ కుక్కర్, ద్వితీయబహుమతి-డిన్నర్ సెట్, తృతీయ బహుమతిగా -ఒక చీర.ఈ ఆఫర్‌కు సంబంధించి మరియు పొడి చెత్త సేకరణ షెడ్యూల్ కోసం మండల ప్రజలందరూ తమ సమీప గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సంప్రదించాలని ఎంపీడీవో మనోహర్ గౌడ్ కోరారు. ఇళ్లలోని పొడి చెత్తను రోడ్లు, కాలువలపై పడేయకుండా స్వచ్ఛ రథానికి అందించి, గ్రామాల స్వచ్ఛతలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )