కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) అక్టోబర్ 03. చిత్తూరు జిల్లా పట్టణ కేంద్రంలో సమాచార హక్కు చట్టం-2005 21వ వారోత్సవాలలో భాగంగా నిర్వహించనున్న శాంతియుత అవగాహనా ర్యాలీకి అధికారిక అనుమతితో, సమాచార హక్కు చట్టం అవేర్నస్ సంస్థ ఫౌండర్ బండి పట్టాభిరెడ్డి నాయకత్వంలో అక్టోబర్ 5, 2026న సోమవారం ఉదయం 10:30 నిమిషాలకు పట్టణ కేంద్రంలోని మహాత్మ గాంధీ కూడలి వద్ద నుంచి ప్రారంభం కానున్న ర్యాలీకి సమాచార హక్కు చట్టం అవేర్నస్ సంస్థ ఆక్టివిస్ట్ లు, పౌరులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని RTI-AS జాతీయ C.E.O K.జ్యోతి ప్రకాష్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.