Logo
Date of Publish : 03 August 2026, 5:55 am
Editor : Katta Ravindar

అంతర్జాతీయ స్నేహితులదినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న దోనేపూడి రమాదేవి..

మియాపూర్ తెలుగు కె న్యూస్ ..
అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని మియాపూర్ డివిజన్ లో ఘనంగా నిర్వహించిన ప్రసాద్స్ ఫౌండేషన్ డైరెక్టర్, మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ నాయకురాలు దోనేపూడి రమాదేవి.గత 20 సంవత్సరాలుగా కలసి మెలసి ఉన్న మహిళామణులు అందరము అందంగా, ఆనందంగా అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకోవడం చాలా చాలా ఆనందంగా ఉందన్నారు. కష్టంలో, సుఖంలో, మేమంతా కలిసి ఒకరికి ఒకరు అండగా ఉంటామని ఆమె తెలిపారు, మాకు అందరికి స్నేహం విలువలు తెలుసు అని, అందుకే మా అందరి జీవితాల్లో స్నేహం అనే వెలుగులు నింపుకున్నామని చెప్పారు. ప్రతి మనిషికి జీవితంలో ఎంతో కొంత మంది మంచి స్నేహితులను సంపాదించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో 100 మంది మహిళలు, పిల్లలు పాల్గొన్నారు,ఈ కార్యక్రమంలో గాయత్రి, రాజేశ్వరి, పద్మశ్రీ, దోనేపూడి మంజుల , సింధూర , మాధురి , ఉష , శాంతి, భవాని, మరియు అనేక మంది మహిళా మణులు మరియు పిల్లలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరికి ఆటలపోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు, అలాగే కేక్ కట్ చేసి, స్వీట్స్ పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు దోనేపూడి రమాదేవి


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )