Logo
Date of Publish : 11 July 2026, 8:19 am
Editor : Katta Ravindar

అక్రమ మొరం తవ్వకం.. జేసీబీ, టిప్పర్ సీజ్

[caption id="attachment_3774" align="alignleft" width="1080"] నిజామాబాద్ జిల్లా, నవీపేట్, జూలై 11: మండలంలోని అబ్బంగపట్నం గ్రామ శివారులో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా మొరం తవ్వకాలు జరుగుతున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు, పోలీసులు సంయుక్తంగా చర్యలు చేపట్టారు.
సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మారం గ్రామానికి చెందిన సూర నర్సయ్యకు సంబంధించిన జేసీబీ, టిప్పర్ వాహనాలను గుర్తించి స్వాధీనం (సీజ్) చేసుకున్నారు.
అనుమతులు లేకుండా మొరం తవ్వకాలు చేపట్టిన ఘటనపై సూర నర్సయ్యతో పాటు ఇతరులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను అధికారులు వెల్లడించారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )