Logo
Date of Publish : 15 July 2026, 12:58 pm
Editor : Katta Ravindar

ఎస్టీపీపీలో సింగరేణి డైరెక్టర్ (ఈ&ఎం) పర్యటన

జైపూర్, జూలై 15 (తెలుగు K24 న్యూస్): సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపీపీ)లో బుధవారం తాడిచెర్ల-2 బొగ్గు బ్లాక్ సాధన విజయోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింగరేణి డైరెక్టర్ (ఈ&ఎం) ఎం. తిరుమలరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాడిచెర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపు సింగరేణి సంస్థకు చారిత్రాత్మక విజయమని తెలిపారు. ఈ గనిలో సుమారు 400 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉండగా, దాదాపు 45 ఏళ్ల పాటు ఉత్పత్తి కొనసాగుతుందని, వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
అనంతరం డైరెక్టర్ 1×800 మెగావాట్ల మూడో యూనిట్ నిర్మాణ పనులు, బాయిలర్, ట్రాక్ హాపర్, ఎఫ్‌జీడీ ప్రాజెక్టు పనులను పరిశీలించి, నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ప్లాంట్ ఈడీ చిరంజీవి, జీఎం మదన్ మోహన్, ఏజీఎంలు, అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )