
కామారెడ్డి: తెలుగు కే న్యూస్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌ను బిక్నూర్ మండలం గుర్జాకుంటలో కాకుండా కామారెడ్డి జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థి సేన నాయకులు అదనపు కలెక్టర్ విక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
జిల్లా కేంద్రంలో రవాణా, హాస్టళ్లు, విద్యాసంస్థలు, వైద్య సేవలు తదితర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండటంతో అన్ని మండలాల విద్యార్థులకు సులభంగా చేరుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఏటీసీని కామారెడ్డిలోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్త్మికార్ వినయ్ కుమార్‌తో పాటు చందు, నోమన్, ప్రణయ్, పాషా తదితరులు పాల్గొన్నారు.