Logo
Date of Publish : 29 June 2026, 8:59 am
Editor : Katta Ravindar

కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి విలేకరుల సమావేశం

కామారెడ్డి జిల్లా | తెలుగు K24 న్యూస్కామారెడ్డి

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్మూర్‌లో ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు అనవసరంగా మతం రంగు పులుముతున్నాయని అన్నారు.
పెర్కిట్ గ్రామంలోని ఓ పాఠశాలలో హిందూ విద్యార్థులకు ఖురాన్ చదవడం, నమాజ్ చేయడం నేర్పిస్తున్నారని, తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా నమాజ్ చేయిస్తున్నారని ఆరోపించారు.
పాఠశాల ప్రిన్సిపాల్ ఇమ్రాన్ ఖాన్‌కు ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్నాయని, విదేశీ శక్తుల నుంచి నిధులు తీసుకుని హిందువులను మత మార్పిడులకు గురిచేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
హైదరాబాద్ నుంచి కొందరు గుండాలు ఆర్మూర్‌కు వచ్చి గొడవలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
ముస్లింలు ప్రశాంతంగా ఉండాలని, ఇద్దరి మధ్య జరిగిన చిన్న గొడవను అనవసరంగా పెద్దది చేస్తున్నారని అన్నారు. సంఘ విద్రోహ శక్తులు హిందూ–ముస్లింల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు.
ఆర్మూర్ లాంటి ప్రాంతాల్లో హిందువులు, ముస్లింలు కలిసి కూర్చొని సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలు మతపరమైన ఆవేశాలకు లోనుకాకుండా అన్నదమ్ముల్లా కలిసి జీవించాలని కోరారు.
మతం ముసుగులో ఎంఐఎం గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తోందని రాకేష్ రెడ్డి ఆరోపించారు


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )