Logo
Date of Publish : 08 August 2026, 12:36 pm
Editor : Katta Ravindar

కామారెడ్డి నియోజకవర్గ అభివృద్దే షబ్బీర్ ఆలీ లక్ష్యం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నాగరాజ్ గౌడ్

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు

బీబీపేట్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా పంచాయతీరాజ్ శాఖ నుంచి 75.19 కోట్ల నిధులు మంజూరు కావడంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ అహర్నిశలు కృషి చేస్తూ నిధులు మంజూరు చేయించడం పట్ల ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని రంగాల్లో రాష్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రజా పాలనలో ముందుకు సాగుతుందన్నారు నియోజకవర్గంలో విద్య, వైద్యం, త్రాగునీరు వంటి రంగాలకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అధిక ప్రాధాన్యత ఇస్తూ ఆయా రంగాల్లో నిధులకు ప్రజా ప్రభుత్వానికి నివేదిస్తూ నిధులు మంజూరుకు కృషి చేస్తున్నారన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రత్యేక చొరవతో రానున్న రోజుల్లో నిధుల కేటాయింపుల వల్ల అభివృద్ధి కార్యక్రమాలతో నియోజకవర్గానికి మహార్దశ కలగనుందన్నారు నియోజకవర్గానికి నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి,జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కకు, మంత్రివర్గానికి ధన్యవాదములు తెలుపుతున్నామన్నారు


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )