Logo
Date of Publish : 22 August 2026, 2:59 am
Editor : Katta Ravindar

గురువులపై దాడులు సిగ్గుచేటు

[caption id="attachment_5470" align="alignright" width="1080"] గురువులపై దాడులు చేస్తూ ప్రాణాలు తీసుకోవడం అత్యంత బాధాకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థుల్లో ఉపాధ్యాయుల పట్ల గౌరవభావం పెంపొందించాల్సిన అవసరం ఉందని టీజీవీపీ నగర కార్యదర్శి కెవిన్ అన్నారు.
నల్లగొండ జిల్లాకు చెందిన ప్రైవేట్‌ పాఠశాల ప్రిన్సిపాల్‌ రూపారెడ్డి మృతికి సంతాపంగా టీజీవీపీ ఆధ్వర్యంలో ఎస్సీ బాలుర వసతి గృహంలో నివాళుల కార్యక్రమం నిర్వహించారు. కెవిన్ ఆధ్వర్యంలో రూపారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి, కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. అనంతరం ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కొద్దిసేపు మౌనం పాటించారు.
ఈ సందర్భంగా కెవిన్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు విద్యార్థులను తప్పిదాలపై మందలిస్తే వాటిని సరిదిద్దుకునే విధంగా స్వీకరించాలన్నారు. అంతేకానీ ఉపాధ్యాయులపై దురుసుగా ప్రవర్తించడం, దాడులకు పాల్పడటం ఏమాత్రం సమంజసం కాదన్నారు. గురువులను దేవుళ్లలా భావించి గౌరవించాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థిపై ఉందన్నారు.
సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల్లో కనిపించే హింసాత్మక పాత్రలను ఆదర్శంగా తీసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. ఫ్యాక్షన్‌ సినిమాలు, హింసను ప్రోత్సహించే కంటెంట్‌కు దూరంగా ఉండి, మంచి విలువలను పెంపొందించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నితిన్, రాజేష్, సుజిత్, సిద్దు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )