తెలుగు కె న్యూస్(జూన్ 22 )గన్నేరువరం మండల రిపోర్టర్
* గన్నేరువరం మండలంలోని చీమలకుంటపల్లి గ్రామంలో భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవాలు సోమవారం రోజున ఘనంగా ప్రారంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ ఉత్సవాల్లో భాగంగా గోపూజ కుంకుమ పూజ చండీయాగాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో గ్రామ ప్రజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఉత్సవాలు ప్రారంభంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.