కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు
తెలంగాణలో ట్రాఫిక్ పోలీసుల విధి నిర్వహణ లో కీలక మార్పులు తీసుకురావాలని ఉన్నత అధికారులు యోచిస్తున్నారు. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ సిబ్బంది వ్యక్తిగత మొబైల్ ఫోన్లు వినియోగించకుండా నిషేధించే ప్రతిపాదనపై సమీక్ష జరుగుతుంది. విధుల సమయంలో మొబైల్ వినయోగం వల్ల అప్రమత్తత తగ్గి ప్రమాదాలు జరిగితే వెంటనే స్పందించే అవకాశం తగ్గుతుందనే అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అధికారిక సమాచారం మార్పిడి కోసం కేవలం VHF సెట్లనే ఉపయోగించే విధానాన్ని అమలు చేయాలని చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి తుది ఆమోదం లభిస్తే కొత్త రూల్స్ ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉంది.