Logo
Date of Publish : 13 August 2026, 1:27 pm
Editor : Katta Ravindar

దుబ్బాకలో మాల ఉపకులాల మహాధర్నా

 

దుబ్బాక: తెలుగు కే న్యూస్ మాలలు, మాల ఉపకులాలకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నెల 23న దుబ్బాక పట్టణ కేంద్రంలో ‘హలో మాల – చలో దుబ్బాక’ పేరుతో మహాధర్నా నిర్వహించనున్నట్లు జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య తెలిపారు. బెజ్జంకి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మహాధర్నాకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.ఎస్సీ వర్గీకరణ, రోస్టర్ విధానం వల్ల మాలలకు నష్టం జరుగుతోందని, రోస్టర్ విధానాన్ని పునఃసమీక్షించాలని వారు డిమాండ్ చేశారు. మాలలు, అనుబంధ కులాల హక్కుల కోసం పెద్దఎత్తున తరలివచ్చి మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు మాల సంఘం నాయకులు పాల్గొన్నారు.

 


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )