Logo
Date of Publish : 11 August 2026, 11:12 am
Editor : Katta Ravindar

నారాయణపూర్‌ను ముంపు గ్రామంగా ప్రకటించాలి

నిర్వాసితులకు న్యాయం చేయాలి.. గ్రామస్థులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి

 

కరీంనగర్: తెలుగు కే న్యూస్ నారాయణపూర్ రిజర్వాయర్ నిర్మాణంతో ప్రభావితమవుతున్న నారాయణపూర్ గ్రామాన్ని అధికారికంగా ముంపు గ్రామంగా ప్రకటించి, నిర్వాసితులకు పూర్తి న్యాయం చేయాలని తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రిజర్వాయర్ నిర్మాణం, నీటి నిల్వ సామర్థ్యం పెంపుతో గ్రామ ప్రజలు భూములు, ఇళ్లు, వ్యవసాయ జీవనోపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆయన పేర్కొన్నారు. ముంపు పరిధిలోకి వచ్చే భూములను శాస్త్రీయంగా సర్వే చేసి నమోదు చేయడంతో పాటు భూములు, ఇళ్లు, చెట్లు, బోర్లు, పంటలకు ప్రస్తుత మార్కెట్ విలువకు అనుగుణంగా న్యాయమైన పరిహారం చెల్లించాలని కోరారు.
అర్హులైన ప్రతి నిర్వాసిత కుటుంబానికి పునరావాస ప్యాకేజీని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, గ్రామసభ నిర్వహించి ముంపు, పరిహారం, పునరావాసానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితుల పిల్లల విద్య, ఉపాధి, తాగునీరు, రహదారులు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని కోరారు.
అలాగే గ్రామస్థులపై నమోదు చేసిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని హరిప్రసాద్ డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరుతో ప్రజలు నష్టపోకుండా వారి హక్కులను కాపాడుతూ అభివృద్ధి చేపట్టాలని అన్నారు. ప్రభుత్వం వెంటనే ముంపు సర్వే నిర్వహించి, గ్రామాన్ని అధికారికంగా ముంపు గ్రామంగా
ప్రకటించడంతో పాటు బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన పార్లమెంట్ ఇన్‌చార్జి లింగంపల్లి నాగరాజు, చొప్పదండి నియోజకవర్గ నాయకులు మ్యాకల తిరుపతి, మ్యాక వినోద్, కొత్తపల్లి తిరుపతి, చంటి శ్రీనివాస్, బుడిగె పర్షారం గౌడ్, జంగ అపర్ణ, లింగంపల్లి మల్లేష్, రంగరవేణి లక్ష్మణ్, కుతాడి శ్రీనివాస్, బసవేణి రాజేందర్, మ్యాక మారుతి తదితరులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )