Logo
Date of Publish : 18 July 2026, 1:07 pm
Editor : Katta Ravindar

నూతన బాధ్యతలు చేపట్టిన పోలీసు అధికారులకు ఎస్పీ అభినందనలు

కామారెడ్డి, K24 న్యూస్ తెలుగు: బిక్నూర్ ఎస్‌హెచ్‌ఓగా ఎస్. అనిల్, రాజంపేట ఎస్‌హెచ్‌ఓగా డి. ఆంజనేయులు, మాచారెడ్డి ఎస్‌హెచ్‌ఓగా కె. విజయ్, బీబీపేట ఎస్‌హెచ్‌ఓగా నవీన్ చంద్ర, బాన్సువాడ ఎస్‌ఐగా శిరీష బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎస్పీ నూతన అధికారులను అభినందిస్తూ, ప్రజలకు నాణ్యమైన, బాధ్యతాయుతమైన పోలీసు సేవలు అందించాలని సూచించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరిస్తూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పాటు నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు. అధికారులు ప్రజా సేవకు అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )