బెజ్జంకి, తెలుగు కే న్యూస్ ఆగస్టు 1: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో శనివారం ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల సేవలను గుర్తు చేసుకుంటూ పలువురు వారిని అభినందించారు.ప్రజా రవాణా వ్యవస్థలో ఆటో డ్రైవర్లు కీలక పాత్ర పోషిస్తూ ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారని పేర్కొన్నారు. "మూడు చక్రాలపై ప్రయాణం... వెనుక వేలాది కుటుంబాల శ్రమజీవనం" అనే సందేశంతో ఆటో డ్రైవర్ల కష్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు.
ఎండ, వాన, చలి తేడా లేకుండా ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న ఆటో కార్మికుల శ్రమ సమాజానికి ఆదర్శమని, వారి సంక్షేమానికి ప్రభుత్వం, ప్రజలు మరింత సహకారం అందించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మండలంలోని ఆటో డ్రైవర్లందరికీ ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.