K 24న్యూస్ సిద్దిపేట జిల్లా బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్తన్నపేట స్టేజ్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దాచారం గ్రామానికి చెందిన కనగండ్ల పోషయ్య ప్రయాణిస్తున్న టీవీఎస్ ఎక్స్‌ఎల్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చిన మారుతి ఎర్టిగా కారు ఢీకొట్టింది. అనంతరం అదే కారు బజాజ్ ఆటోను కూడా ఢీకొనడంతో గంగుల ఐలయ్య గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా, కారు డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడిపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై బెజ్జంకి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.