[caption id="attachment_4519" align="alignleft" width="2560"]
నిజామాబాద్ జిల్లా,నవీపేట్ మండలంలోని :-మద్దేపల్లి గ్రామానికి చెందిన గ్రామస్థులు ఆదివారం గ్రామ శివారులోని ప్రకృతి ఒడిలో వనభోజనాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి పచ్చని వాతావరణంలో ఒకచోట చేరిన గ్రామస్థులు ఆనందోత్సాహాల మధ్య ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు.
ఈ సందర్భంగా మహిళలు, పురుషులు, చిన్నారులు కలిసి వివిధ రకాల వంటకాలను ఆస్వాదిస్తూ ఆత్మీయంగా ముచ్చటించారు. చిన్నారులు ఆటలతో సందడి చేయగా, పెద్దలు గ్రామ అభివృద్ధి, కుటుంబ విషయాలపై చర్చించుకుంటూ ఆహ్లాదకరంగా గడిపారు.
గ్రామీణ జీవనంలో ఇలాంటి వనభోజనాలు పరస్పర అనుబంధాలను మరింత బలోపేతం చేస్తాయని గ్రామస్థులు పేర్కొన్నారు. అందరూ సంతోషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.[/caption]