Logo
Date of Publish : 18 August 2026, 12:20 pm
Editor : Katta Ravindar

యాంగ్ఇం డియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి రూ 200 కోట్లు మంజూరు ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్అలీ

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు

కామారెడ్డి నియోజకవర్గంలో రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ (వై.ఐ.ఐ.ఆర్.ఎస్.) ఏర్పాటు కానుంది. ఈ మేరకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కృతజ్ఞతలు తెలిపారు.
కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌తో కలిసి షబ్బీర్ అలీ మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ద్వారా జారీ చేసిన జి.ఓ.ఆర్.టి. నెంబర్.145, తేదీ 04-08-2026 ప్రకారం కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ (.వై.ఐ.ఐ.ఆర్.ఎస్.) కాంప్లెక్స్ భవన నిర్మాణానికి రూ.200 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరైనట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని షబ్బీర్ అలీ అన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. కామారెడ్డి నియోజకవర్గానికి రూ.200 కోట్లతో .వై.ఐ.ఐ.ఆర్.ఎస్.
మంజూరు కావడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు.
ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ద్వారా ఒకే ప్రాంగణంలో నాణ్యమైన పాఠశాల విద్యతో పాటు ఉన్నత విద్యకు అవసరమైన విద్యా వాతావరణం కల్పించనున్నట్లు తెలిపారు. ఆధునిక తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, క్రీడా సదుపాయాలు, విద్యార్థుల వసతి, భోజనం తదితర మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయని వివరించారు.పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు మెరుగైన విద్య అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని షబ్బీర్ అలీ తెలిపారు. ఆర్థిక పరిస్థితులు విద్యార్థుల భవిష్యత్తుకు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో విద్యారంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్నామని చెప్పారు.వై.ఐ.ఐ.ఆర్.ఎస్. ద్వారా కామారెడ్డి విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు లభిస్తాయని, పోటీ ప్రపంచానికి వారిని సిద్ధం చేయడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం విద్యాసంస్థల ఆధునీకరణ, మౌలిక వసతుల కల్పన, డిజిటల్ విద్య, ప్రయోగశాలలు, ఆధునిక భవనాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. కామారెడ్డిని విద్యా హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంలో భాగంగా రూ.200 కోట్ల YIIRS ప్రాజెక్టు మరో కీలక ముందడుగు అని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో విద్యారంగాన్ని మరింత బలోపేతం చేస్తామని, కామారెడ్డి నియోజకవర్గ విద్యార్థులకు అత్యుత్తమ విద్యా అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని షబ్బీర్ అలీ తెలిపారు. ఈ విద్యాలయాన్ని మండలంలో నిర్మించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.ఈ సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఉమా శ్రీనివాస్, డీసీసీ మాజీ అధ్యక్షుడు కైల శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఐరేని సందీప్ కుమార్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, వివిధ మండలాల అధ్యక్షులు, ఏఎంసీ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )