Logo
Date of Publish : 20 August 2026, 6:49 pm
Editor : Katta Ravindar

రామకృష్ణ కాలనీ ఎం జె పి హాస్టల్‌లో అధ్వాన్న వసతులు

450 మంది విద్యార్థులకు కనీస సౌకర్యాలు కరువు.. విషకీటకాల భయంతో విద్యార్థులు

తిమ్మాపూర్, ఆగస్టు 20 (తెలుగు కే న్యూస్): తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని ఎంజేపీ హాస్‌లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్‌లో దాదాపు 450 మంది విద్యార్థులు ఉంటున్నారు. అలాగే బాత్రూమ్‌లకు తలుపులు సరిగా లేకపోవడం, 450 మంది విద్యార్థులకు సరిపడా బాత్రూమ్‌లు, నీటి నల్లా కనెక్షన్లు లేకపోవడం దయనీయ పరిస్థితులకు అద్దం పడుతుందని తల్లిదండ్రులు అంటున్నారు.హాస్టల్‌లోని పలు ప్రాంతాల్లో నీటి లీకేజీల కారణంగా నీటి గుంతలు ఏర్పడి, దోమలు, ఇతర కీటకాలు పెరుగుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. దీంతో కొంత మంది విద్యార్థులు జ్వరాలు, చర్మ సంబంధిత అలర్జీలతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది.విద్యార్థులు చెబుతున్న సమస్యలను హాస్టల్ ప్రిన్సిపల్ కూడా ప్రస్తావించడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనమని తల్లిదండ్రులు పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన అంశం ప్రభుత్వం, సంబంధిత అధికారులు హాస్టల్‌ను పరిశీలించి ప్రహరీ గోడ నిర్మాణం, బాత్రూమ్‌లు, నీటి వసతి గృహాలు, లీకేజీల మరమ్మతులు తదితర సమస్యలను పరిష్కరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )