కామారెడ్డి జిల్లా : K24 న్యూస్ తెలుగు
న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులకు మద్దతుగా శాంతియుత నిరసన చేపట్టిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ తదితరులను అరెస్టు చేయడాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, ప్రతిపక్ష నాయకుల అరెస్టు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. అలాగే నీట్ పరీక్షల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.