కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రామారెడ్డి రోడ్ లో గల రెయిన్బో బ్లడ్ బ్యాంకును కామారెడ్డి డి.ఎస్.పి మధుసూదన్ మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ నరహరి ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యరంగం ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవని మానవతా దృక్పథంతో రక్తదాతలు ముందుకు వస్తేనే సకాలంలో రక్తాన్ని అందజేయగలుగుతామని అన్నారు.
ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన ఐ వి ఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ రక్తం దొరకక ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారని తల సేమియా బాధిత చిన్నారులకు వారి జీవితాంతం 15 రోజులకు ఒక ఎన్ని రక్తం అవసరం ఉంటుందని అలాంటి చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి రక్తదాతలు ముందుకు రావాలని అన్నారు.నూతనంగా రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేసిన యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు.ఈ రక్తదాన శిబిరంలో కామారెడ్డి జిల్లా సెంట్రల్ ఆర్మ్డ్ పరామిలిటరీ ఫోర్స్ యూనియన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎమ్.డి. గౌస్ఉద్దీన్ అధ్వర్యంలో సైనికులు హెడ్ కానిస్టేబుల్ బండి ప్రభాకర్(బి యస్ఎఫ్),మోతాజి బాల కృష్ణ రావు,మాజీ సైనికుడు రంజిత్ రెడ్డి,కానిస్టేబుల్ బద్రి లు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు.వీరికి డీఎస్పీ మధుసూదన్,సీఐ నరహరి ప్రశంస పత్రాలను,ఉత్తమ రక్తదాత పురస్కారాలను అందజేసి సన్మానించడం జరిగింది.దేశ రక్షణ కోసం సేవ చేయడమే కాకుండా ప్రాణాలను కాపాడడానికి రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ మల్లికార్జునరావు,ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీధర్,డాక్టర్ సంతోష్ కుమార్,ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖర్,డాక్టర్ అజయ్ పేరాల,ఐవిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలువేరీ మారుతి, ఆర్కే విద్యాసంస్థల సీఈవో జైపాల్ రెడ్డి,24 వ వార్డు కౌన్సిలర్ డాకి అరవింద్ రాజ్ మరియు బ్లడ్ బ్యాంక్ యాజమాన్యం ససాల రాజు,భట్టు భరద్వాజ్,సైఫ్ నజీర్,మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.