మంచిర్యాల k24 న్యూస్, జూన్ 22: ఇటీవల మంచిర్యాల బాయ్స్ హైస్కూల్‌ను సందర్శించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను విద్యార్థులు క్రికెట్ కిట్ అందించాలని కోరగా, ఆయన వెంటనే స్పందించారు. ఎంపీ చొరవతో మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా విద్యార్థులకు క్రికెట్ కిట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎంపీ, మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. క్రీడల అభివృద్ధికి ఎంపీ చేస్తున్న కృషిని పలువురు అభినందించారు.