Logo
Date of Publish : 17 September 2026, 8:42 am
Editor : Katta Ravindar

అండర్-16 క్రికెట్‌లో టోర్నమెంట్ ఆల్‌రౌండ్ సత్తా చాటిన డి. కార్తికేయ

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్-16 ఇంటర్ స్కూల్ అండ్ కాలేజ్ టోర్నమెంట్ 2026–27లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా క్రికెట్ జట్టు తరఫున ఆడుతున్న డి. కార్తికేయ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.
టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లోనే ఏకంగా 7 వికెట్లు పడగొట్టి బౌలింగ్‌లో తన సత్తా చాటిన కార్తికేయ.. తాజాగా బ్యాటింగ్‌లోనూ అదరగొట్టాడు. జట్టు 309 పరుగుల భారీ స్కోరు సాధించిన మ్యాచ్‌లో.. కార్తికేయ 111 పరుగులతో నాటౌట్‌గా నిలిచి కీలక పాత్ర పోషించాడు.
బంతితో 7 వికెట్లు.. బ్యాట్‌తో 111 పరుగులు నాటౌట్.. ఇలా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కార్తికేయ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జట్టును విజయాల వైపు నడిపిస్తున్నాడు.
కార్తికేయ ప్రతిభపై RCCA కోచ్ రియాజుద్దీన్ హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా అభినందించారు. తల్లిదండ్రులు కూడా తమ కుమారుడి ప్రదర్శనపై ఆనందం వ్యక్తం చేశారు.
రాబోయే మ్యాచ్‌లలోనూ ఇదే క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో మరింత రాణించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాలని కోచ్ రియాజుద్దీన్ ఆకాంక్షించారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )